అలెక్స్‌ హేల్స్‌ మెరుపులు

Published on Wed, 07/03/2024 - 08:32

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024లో గాలె మార్వెల్స్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ రెచ్చిపోయాడు. జాఫ్నా కింగ్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో (47 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. 

హేల్స్‌తో పాటు నిరోషన్‌ డిక్వెల్లా (27 బంతుల్లో 47; 8 ఫోర్లు, సిక్స్‌), జనిత్‌ లియనాగే (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌), జహూర్‌ ఖాన్‌ (4-0-24-3), ప్రిటోరియస్‌ (4-0-23-2), ఉడాన (4-0-60-2) రాణించడంతో మార్వెల్స్‌ 5 వికెట్ల తేడాతో జాఫ్నాపై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా.. నిస్సంక (51), అవిష్క ఫెర్నాండో (59), అసలంక (33) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్‌ చివరి బంతికి విజయం సాధించింది. మార్వెల్స్‌ గెలుపు చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. సహన్‌ బౌండరీ బాదాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో, ఫేబియన్‌ అలెన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డిసిల్వ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

రాణించిన వెల్లలగే, షాదాబ్‌ ఖాన్‌

నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌పై కొలొంబో స్ట్రయికర్స్‌ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కొలొంబో.. సమరవిక్రమ (48), తిసార పెరీరా (38), ముహమ్మద్‌ వసీ​ం (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో రజిత, హసరంగ చెరో​ 2 వికెట్లు పడగొట్టగా.. షనక, చమీరా, అఘా సల్మాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ.. దునిత్‌ వెల్లలగే (4/20). షాదాబ్‌ ఖాన్‌ (4/22) రెచ్చిపోవడంతో 15.5 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. చండీమల్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)