Breaking News

సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండిస్‌.. రెండో శ్రీలంక బ్యాట‌ర్‌గా రికార్డు

Published on Tue, 07/08/2025 - 18:36

శ్రీలంక వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. పల్లెకలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మెండిస్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో మెండిస్ 95 బంతుల్లో త‌న ఆరో వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ వికెట్ కీప‌ర్ బ్యా ట‌ర్ స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు పాథుమ్ నిస్సాంక‌,  చ‌రిత్ అస‌లంక‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు.

ఓవ‌రాల్‌గా 114 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌.. 18 ఫోర్ల‌తో 124 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును మెండిస్ త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై 2 వేల ప‌రుగుల మైలు రాయిని అందుకున్న రెండో శ్రీలంక క్రికెట‌ర్‌గా మెండిస్ నిలిచాడు. కుశాల్ ఇప్ప‌టివ‌ర‌కు బంగ్లాపై మూడు ఫార్మాట్లు క‌లిపి 2032 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర(3090) అగ్ర‌స్దానంలో ఉన్నాడు.

బంగ్లాదేశ్‌పై అత్య‌ధిక అంత‌ర్జాతీయ ప‌రుగులు చేసిన శ్రీలంక ఆట‌గాళ్లు వీరే
కుమార్ సంగక్కర – 3090
కుసాల్ మెండిస్ - 2032
దిల్షాన్ - 1903
మహేల జయవర్ధనే - 1723
ఉపుల్ తరంగ – 1507

బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఇక  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండిస్‌తో పాటు నిస్సాంక‌(35), అస‌లంక‌(58) రాణించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో టాస్కిన్ ఆహ్మ‌ద్‌, మెహాదీ హ‌స‌న్ మిరాజ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ష‌మీమ్‌, త‌న్వీర్‌, ష‌కీబ్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)