Breaking News

అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్‌!

Published on Tue, 08/22/2023 - 08:12

ఆసియాకప్‌ 2023కు భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్‌ వర్మకు కీలకమైన ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కడం గమానార్హం.

ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌కు ఆసియాకప్‌ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్‌ బ్యాట్‌తో కూడా రాణించగలడని, అందుకే చహల్‌ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 

"విండీస్‌ సిరీస్‌లో  సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్‌ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్‌కు లోయార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది.

ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్‌ చైనామన్‌ బౌలర్‌ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్‌ను కాదని కుల్దీప్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్‌! అప్పుడు రోహిత్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)