నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

Published on Wed, 06/04/2025 - 20:34

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్‌ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్‌-వ​న్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తుంది. 

కుల్దీప్‌-వన్షిక ఎంగేజ్‌మెంట్‌కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్‌ త్వరలో ప్రకటించనున్నాడు.

కుల్దీప్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.   ఈ సీజన్‌లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్‌ తర్వలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. 

ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ ఒక్కడే. అశ్విన్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక కుల్దీప్‌ భారత టెస్ట్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2024 టీ20 వరల్డ్‌కప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కుల్దీప్‌ కీలకంగా వ్యవహరించాడు.

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)