Breaking News

కలిసికట్టుగా పోరాడి భారత్‌ను గెలిపించిన కుకి-మీతై ఫుట్‌బాలర్లు

Published on Tue, 12/02/2025 - 12:03

వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఆసియా కప్‌కు అర్హత సాధించడం ద్వారా భారత అండర్‌-17 పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ ఫైనల్లో ఆసియా పవర్‌ హౌస్‌ ఇరాన్‌ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించింది. 

అహ్మదాబాద్‌లోని ఈకే ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 2-1 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత్‌ ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరడం ఇది మూడోసారి మాత్రమే. ఆసియా కప్‌లో భారత్‌ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. 
మ్యాచ్‌ 19వ నిమిషంలో ఇరాన్ గోల్‌ చేసి ముందంజలోకి వెళ్లింది. హాఫ్ టైమ్‌కు ముందు దల్లాల్ముయోన్ గాంగ్టే (కుకి) పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోర్‌ను సమం చేశాడు. రెండో అర్దభాగంలో గున్లైబా వాంక్హైరక్పం (మీతై) కౌంటర్ అటాక్‌లో గోల్‌ కొట్టి  భారత్‌ను చారిత్రక విజయం దిశగా నడిపించాడు.

జాతి ఘర్షణలు పక్కకు పెట్టి దేశం కోసం పోరాడిన యువకులు
మణిపూరి జాతి ఘర్షణల్లో ప్రత్యర్థులుగా పోరాడిన కుకి-మీతై తెగలకు చెందిన ఆటగాళ్లు కలిసికట్టుగా గోల్స్‌ చేసి భారత్‌ను గెలిపించారు. మణిపూర్‌లో 2023 నుంచి మీతై–కుకిల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భూస్వామ్య హక్కులు, రాజకీయ ప్రతినిధిత్వం, భద్రతా సమస్యలు వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి.

కుకి అంటే ఈశాన్య భారతదేశంలోని ఓ ప్రధాన గిరిజన సమూహం. వీరి మతం క్రైస్తవం. మీతై అంటే ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రధాన జాతి సమూహం. వీరు హిందుమతాన్ని ఆచరిస్తారు. 

ప్రస్తుత భారత జట్టులో 9 మంది మణిపూర్‌ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 7 మంది మీతై, 2 మంది కుకి తెగలకు చెందిన వాళ్లు. మణిపూర్ ఎప్పటినుంచో భారత ఫుట్‌బాల్‌కు ప్రతిభావంతుల్ని అందిస్తున్న టాలెంట్ ఫ్యాక్టరీగా కీర్తించబడుతుంది.

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)