Breaking News

IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

Published on Sat, 01/17/2026 - 20:45

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్‌కు గుడ్ న్యూస్‌. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

ఈ విష‌యాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీక‌రించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసిన‌ట్లు కేఎస్‌సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీల‌తో కళకళలాడనుంది" అని కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

స‌ర్కార్ నిబంధ‌న‌లు ఇవే..
స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని క‌ర్ణాట‌క స‌ర్కార్‌ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్‌లను పూర్తిగా మార్చాలని ప్ర‌భుత్వం సూచించింది. 

కాగా ఐపీఎల్‌-2025 ఆర్సీబీ ఛాంపియ‌న్‌గా నిలిచిన అనంత‌రం.. చిన్న‌స్వామి స్టేడియంలో విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. 

దీంతో అప్ప‌టి నుంచి చిన్న‌స్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జ‌ర‌గలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదిక‌ను తొలిగించారు. అయితే తిరిగి మ‌ళ్లీ చిన్న‌స్వామి స్టేడియంలో క్రికెట్ క‌ళ సంత‌రించుకోనుండ‌డంలో కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్‌ది కీల‌క పాత్ర‌.
చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్‌ ఘన విజయం

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)