Breaking News

RCB Vs KKR: కృనాల్ సూపర్ బాల్‌.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published on Sat, 03/22/2025 - 21:50

ఐపీఎల్‌-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌.. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ స్పిన్నర్‌ కృనాల్ పాండ్యా అద్భుతమైన బంతితో అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన కృనాల్‌.. తొలి బంతిని వెంకటేశ్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని అయ్యర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కృనాల్ ఎక్కువ వేగంతో బంతిని సంధించడంతో.. అది అయ్యర్ బ్యాట్‌, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత రింకూ సింగ్‌ను కూడా ఇదే తరహా బంతితో పాండ్యా బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు.

అయ్యర్‌పై భారీ ధర..
కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో వెంక‌టేశ్ అయ్య‌ర్‌పై కేకేఆర్ భారీ ధ‌ర వెచ్చింది. అత‌డిని ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతేకాకుండా త‌మ జ‌ట్టు వైస్ కెప్టెన్సీని కూడా కేకేఆర్ అప్ప‌గించింది.  కానీ వెంకటేశ్‌ మాత్రం మొదటి మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

ఆర్సీబీ ఘనవిజయం..
కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(59) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(31 బంతుల్లో 56), పాటిదార్‌(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సునీల్‌ నరైన్‌(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, సుయాష్‌ శర్మ, సలీం​ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IPL 2025: అజింక్య ర‌హానే విధ్వంసం.. కేవ‌లం 25 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)