Breaking News

'అతడు పేరుకే ఆల్‌రౌండర్‌.. చూస్తుంటే నవ్వొస్తుంది'

Published on Sun, 07/12/2026 - 15:13

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబేపై బీసీసీఐ మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించారు. వరుసగా విఫలమవుతున్నప్పటికి జట్టులో దూబేను కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న దూబే తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 

ఇంగ్లండ్ పిచ్‌లపై షార్ట్ బంతులను ఆడలేక అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. శనివారం రోజ్‌బౌల్ వేదిక‌గా జ‌రిగిన ఐదో టీ20లో కూడా దూబే దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఒక ఓవ‌ర్ బౌలింగ్ చేసిన దూబే.. రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి ఏకంగా 22 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

బ్యాటింగ్‌లో కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన అత‌డు కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంతేకాకుండా ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను దూబే జార‌విడిచాడు. 3 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పుకున్న బ్రూక్ ఏకంగా 95 ర‌న్స్ చేశాడు. దీంతో దూబే ఫీల్డింగ్ తీరుపై కూడా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"శివమ్ దూబే ఉంటే మైదానంలో  మనం మ్యాచ్‌లు గెలవడం కష్టమే. బంతి ఎటు వెళ్తుందో అంచనా వేయకుండా దాని చుట్టూ తిరుగుతుంటాడు. అతడు చాలా నెమ్మదిగా, అయోమయంగా ఉంటున్నాడు. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా అతను క్యాచ్‌లు వదిలేయడం అలవాటుగా మార్చుకున్నాడు. 

అసలు దూబే లాంటి ఆటగాడిని ఆల్‌రౌండర్‌ అనడమే ఒక జోక్. అతడిని ఇంటర్ననేషనల్‌ క్రికెటర్‌ అంటే నవ్వుస్తోంది. దూబే క్యాచ్ వదిలేయడం వల్లే ప్రిన్స్ యాదవ్ రిథమ్ దెబ్బతింది. దూబే ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే, మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)