Breaking News

‘కొన్‌స్టాస్‌ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’

Published on Thu, 01/09/2025 - 17:19

ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్‌ కొన్‌స్టాస్‌(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవ్‌ హార్మిన్సన్‌(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్‌ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. 

కాగా డేవిడ్‌ వార్నర్‌(David Warner) రిటైర్మెంట్‌ తర్వాత ఆసీస్‌ ఓపెనింగ్‌ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా తొలుత నాథన్‌ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.

మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపు
టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు.  పెర్త్‌ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్‌)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.

అరంగేట్రంలోనే అర్ధ శతకం
ఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్‌ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్‌బోర్న్‌ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్‌.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్‌.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.

కోహ్లి, బుమ్రాలతో గొడవ
ఇక బ్యాట్‌ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్‌స్టార్లు విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్‌ మరింత ఫేమస్‌ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్‌ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.

డిఫెన్సివ్‌ టెక్నిక్‌ లేదు
ఈ నేపథ్యంలో స్టీవ్‌ హార్మిన్సన్‌ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్‌ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్‌ షాట్లు, స్కూప్‌ షాట్లు ఆడాడు.

కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్‌ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్‌ టెక్నిక్‌ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్‌ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.

మరో డేవిడ్‌ వార్నర్‌ కావాలని కొన్‌స్టాస్‌ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో కొన్‌స్టాస్‌ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆస్ట్రేలియాదే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ
ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఈ మెగా మ్యాచ్‌ బరిలో దిగనున్న కమిన్స్‌ బృందం.. టైటిల్‌ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. 

చదవండి: IND vs ENG: విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)