Breaking News

ఫైనల్లో కోనేరు హంపి

Published on Fri, 07/25/2025 - 04:15

బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్‌ నాకౌట్‌ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ తొలిసారి భారత్‌ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్‌కు చెందిన ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఫైనల్‌కు చేరగా... గురువారం దివ్య సరసన భారత దిగ్గజం కోనేరు హంపి కూడా చేరింది. చైనా గ్రాండ్‌మాస్టర్‌ లె టింగ్జితో జరిగిన రెండో సెమీఫైనల్లోఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి టైబ్రేక్‌లో 4–2 పాయింట్లతో... ఓవరాల్‌గా 5–3 పాయింట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్‌కు చేరింది. 

ఈ గెలుపుతో హంపి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా అర్హత సాధించింది. బుధవారం నిర్ణీత రెండు క్లాసికల్‌ గేమ్‌ల తర్వాత హంపి, లె టింగ్జి 1–1తో సమంగా ఉన్నారు. దాంతో విజేతను తేల్చేందుకు గురువారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు జరిగాయి. అయితే ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం ర్యాపిడ్‌ ఫార్మాట్‌ లోనే మరో రెండు గేమ్‌లు నిర్వహించారు. 

తొలి గేమ్‌లో లె టింగ్జి 65 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 39 ఎత్తుల్లో గెలిచింది. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి వీరిద్దరి మధ్య బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు నిర్వహించారు. ఈ రెండు గేముల్లోనూ హంపి నెగ్గి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో హంపి 70 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలుపొందింది. హంపి, దివ్య మధ్య ఈనెల 26, 27వ తేదీల్లో ఫైనల్‌ జరుగుతుంది. రెండు గేమ్‌లలో ఫలితం తేలకపోతే 28న టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.  

2 ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ పోరుకు చేరడం హంపికిది రెండోసారి. 2011లో మ్యాచ్‌ ఫార్మాట్‌లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హంపి ఫైనల్‌ చేరి చైనా గ్రాండ్‌మాస్టర్‌ హు ఇఫాన్‌ చేతిలో ఓడిపోయింది. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)