Breaking News

Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక

Published on Mon, 09/25/2023 - 10:02

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల  వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్‌లో ఇరాన్‌కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్‌ రౌండ్‌లో వియత్నాం గ్రాండ్‌ మాస్టర్‌ ఫామ్ లే థావో న్గుయెన్‌ను చిత్తు చేసింది.  దీంతో మూడో రౌండ్‌కు హంపి అర్హత సాధించింది.

అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్‌లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్‌లో సింగపూర్‌ గ్రాండ్‌మాస్టర్‌ కియాన్యున్ గాంగ్‌ను ఓడించింది. అయితే పురుషల చెస్‌ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

మొదటి రౌండ్‌లో విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్‌లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్‌లో కజికిస్తాన్‌కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు.

తొలిరౌండ్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్‌.. రెండవ రౌండ్ గేమ్‌ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్‌తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్‌ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్‌ పోటోలు జరగనున్నాయి.

భారత ఖాతాలో తొలి గోల్డ్‌మెడల్‌
ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ కైవసం చేసుకుంది.
చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్‌ మెడల్‌..

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు