Breaking News

కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం

Published on Thu, 09/30/2021 - 05:33

సాక్షి, హైదరాబాద్‌: భారత మహిళల చెస్‌ నంబర్‌వన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కోనేరు హంపి స్పెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న  ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్‌ ఈవెంట్‌ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్‌ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్‌ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్‌ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో గడపాలి.

ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్‌ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్‌ మెసిడోనియా మీదుగా స్పెయిన్‌ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్‌ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్‌ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది. కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్‌లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్‌ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి.

చదవండి: Koneru Humpy: థ్యాంక్యూ సాక్షి.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు

Videos

రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం

వేలాది మంది పాక్ సైనికుల్ని ఎలా తరిమేశాయంటే?

ఎక్కడికైనా వెళ్తామ్.. ఉగ్రవాదులను అంతం చేస్తామ్

ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

Photos

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)