Breaking News

'కోహ్లిలో ఏ మార్పు లేదు.. మేమిద్ద‌రం మంచి స్నేహితులం'

Published on Wed, 08/21/2024 - 18:59

టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా ఇటీవల స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కోహ్లి ప్ర‌వ‌ర్త‌న‌లో  చాలా మార్పులు వ‌చ్చాయి అని ఓ ఇంట‌ర్వ్యూలో మిశ్రా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

తాజాగా ఇదే విష‌యంపై అమిత్ మిశ్రాకు మ‌రో వెట‌ర‌న్ స్పిన్న‌ర్  పీయూష్ చావ్లా ప‌రోక్షంగా కౌంట‌రిచ్చాడు. కోహ్లితో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని, అత‌డిలో ఎటువంటి మార్పు రాలేదు అని చావ్లా చెప్పుకొచ్చాడు.

"విరాట్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్ద‌రం క‌లిసి జానియ‌ర్ స్ధాయిలో క్రికెట్ ఆడాము. ఆ త‌ర్వాత ఐపీఎల్‌, భార‌త జ‌ట్టుకు కూడా మేము క‌లిసి ఆడాము. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎటువంటి మార్పు రాలేదు. 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా కోహ్లి అలానే ఉన్నాడు. 

ఎక్క‌డ క‌లిసినా కూడా అంతే ప్రేమ‌, అభిమానాన్ని చూపిస్తాడు. మేమిద్దరం భోజన ప్రియులం. గతేడాది ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించినప్పుడు నేను విరాట్ బ్రేక్ సమయంలో కలుసుకున్నాము.

అతడు నాదగ్గరకు వచ్చి మనద్దరికి మంచి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పాడు. నేను అందుకు నవ్వతూ సరే అన్నానని" శుభమన్ గౌర్ అనే యూట్యాబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావ్లా పేర్కొన్నాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)