Breaking News

కోహ్లి, రోహిత్‌ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్‌: అశ్విన్‌

Published on Mon, 09/16/2024 - 16:11

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు ఆరునెలల తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున బరిలో​కి దిగనున్నాడు.  సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఇందుకోసం ఇప్పటికే చెన్నై వేదికగా టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ దిగ్గజ స్పిన్నర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.

ఈ సందర్భంగా హోస్ట్‌ విమల్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నలకు అశూ ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తన దృష్టిలో.. బెస్ట్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడేది వీరేనంటూ ఇద్దరు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు అశూ. అదే విధంగా.. పుల్‌ షాట్‌ అత్యుత్తమంగా ఆడేది ఇతడేనంటూ ఆస్ట్రేలియా దిగ్గజం పేరును ప్రస్తావించాడు. ఇంతకీ వారెవరంటారా?

కోహ్లి, రోహిత్‌ కాదు!
కాగా ఆధునిక తరం క్రికెటర్లలో కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడటంలో టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి, పాకిస్తాన్‌ మేటి బ్యాటర్‌ బాబర్‌ ఆజం ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, మాజీ క్రికెటర్లలో డేవిడ్‌ గోవర్‌, మార్క్‌ వా, మైకేల్‌ వాన్‌, సౌరవ్‌ గంగూలీ, మార్కస్‌ ట్రెస్కోతిక్‌ కూడా షాట్‌తో ప్రసిద్ధి చెందినవారే. అయితే, అశ్విన్‌ వీరిలో కోహ్లిని కాదని మార్కస్‌ ట్రెస్కోతిక్‌, మైకేల్‌ వాన్‌లకు ఓటేశాడు.

అతడి కవర్‌ డ్రైవ్‌లే ఇష్టం.. పుల్‌ షాట్లు ఆడటంలో అతడు బెస్ట్‌
‘‘మార్కస్‌ ట్రెస్కోతిక్‌ అంటే ఇప్పటి యువతలో చాలా మందికి తెలియకపోవచ్చు. నాకైతే అందరికంటే అతడి కవర్‌ డ్రైవ్‌లే ఎక్కువగా నచ్చుతాయి. ఇక​ మైకేల్‌ వాన్‌ కూడా.. అద్భుతంగా ఈ షాట్లు ఆడగలడు’’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. ఇక పుల్‌ షాట్లు ఆడటంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌కు ఎవరూ సాటిరారని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుల్‌ షాట్లు సూపర్‌గా ఆడతాడన్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పిల్లర్లుగా
ఇలా.. అభిమానులు ఊహించినట్లుగా కోహ్లి, రోహిత్‌ పేర్లు చెప్పకుండా అశూ.. విదేశీ బ్యాటర్ల పేర్లు చెప్పి ఒకరకంగా వారికి షాకిచ్చాడు. కాగా మార్కస్‌ ట్రెస్కోతిక్‌- మైకేల్‌ వాన్‌ తమ ఆట తీరుతో.. 2000 నాటి తొలినాళ్లలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ విభాగానికి రెండు పిల్లర్ల మాదిరి నిలబడ్డారు. 

ట్రెస్కోతిక్‌ ఇంగ్లండ్‌ తరఫున 76 టెస్టులు ఆడి సగటు 43.79తో 5825 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు ఉన్నాయి. మరోవైపు.. మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ 82 టెస్టుల్లో 5719 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 18 సెంచరీలు ఉన్నాయి.

చివరగా ఇంగ్లండ్‌తో..
టీమిండియా తరఫున అశ్విన్‌ చివరగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. స్వదేశంలో మార్చిలో ముగిసిన ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ సందర్భంగానే అశూ.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో టెస్టుల్లో 516, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఐదు శతకాలు కూడా బాదడం విశేషం.

చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్‌.. లేకుంటే కష్టమే: యూనిస్‌ ఖాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)