Breaking News

విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా

Published on Sun, 01/15/2023 - 21:50

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్‌కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన కింగ్‌ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
►శ్రీలంకపై విరాట్‌కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌తో కలిసి విరాట్‌ సమంగా ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై స‌చిన్ 9 సెంచ‌రీలు చేయగా.. విరాట్‌ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచ‌రీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్‌ కోహ్లి(10).. సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

►ఇక భారత గడ్డపై విరాట్‌కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్‌ సచిన్‌ను అధిగిమించాడు.

►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వ‌న్డేల్లో అత్యధిక ప‌రుగులు చేసిన మూడో క్రికెట‌ర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో స‌చిన్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. అత‌డి త‌ర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిల‌వ‌గా.. 5303 ర‌న్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు.

►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి