Breaking News

హెన్రిచ్‌ క్లాసెన్‌ షాకింగ్‌ నిర్ణయం

Published on Mon, 06/02/2025 - 16:02

సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. క్లాసెన్‌ రిటైర్మెంట్‌ ప్రకటన క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. క్లాసెన్‌ ఈజీగా మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించి ఉండవచ్చు.  

మరో విధ్వంసకర బ్యాటర్‌, ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే క్లాసెన్‌ రిటైర్మెంట్‌ ప్రకటన రావడంతో వారివారి దేశ క్రికెట్‌ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్‌తో పోలిస్తే క్లాసెన్‌కు వయసు, ఫామ్‌ రెండూ ఉన్నాయి. పైగా 2027లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. 

క్లాసెన్‌ ఈ టోర్నీ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించి ఉంటారు. అయితే క్లాసెన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుని వారికి దుఖాన్ని మిగిల్చాడు. ఈ ఏడాది స్టార్‌ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. రోహిత్‌, కోహ్లి టెస్ట్‌లకు.. స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ వన్డేలకు.. తాజాగా క్లాసెన్‌ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లాసెన్‌.. సౌతాఫ్రికా తరఫున 4 టెస్ట్‌లు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు (వన్డేల్లో), 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 3245 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా క్లాసెన్‌ ఐపీఎల్‌ తదితర లీగ్‌ల్లో కొనసాగుతాడు. 

క్లాసెన్‌ ఇటీవలే ఐపీఎల్‌లో సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో క్లాసెన్‌ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 (నాటౌట్‌) పరుగులు చేశాడు. క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్‌ 172.70 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేశాడు. 

ఈ సీజన్‌లో క్లాసెన్‌ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్‌ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్‌ యాజమాన్యం క్లాసెన్‌ను రీటైన్‌ చేసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)