Breaking News

హెన్రిచ్‌ క్లాసెన్‌ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే..!

Published on Fri, 01/12/2024 - 07:47

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. క్లాసెన్‌ ఊచకోత దెబ్బకు డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ 11 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టా​నికి 207 పరుగులు చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (51 బంతుల్లో 87; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. కెప్టెన్‌ పోలార్డ్‌ (14 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (20 బంతుల్లో 25; 3 సిక్సర్లు), వాన్‌డర్‌ డస్సెన్‌ (20 బంతుల్లో 24; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డర్బన్‌ బౌలర్లలో కీమో పాల్‌ 2, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌, ప్రిటోరియస్‌, రిచర్డ్‌ గ్లీసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం​ లక్ష్య ఛేదనలో వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన డర్బన్‌ను విజేతగా ప్రకటించారు. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 166 పరుగులు చేయాల్సి ఉండగా.. డర్బన్‌ 177 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్‌ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌తో పాటు మాథ్యూ బ్రీట్జ్కీ (39) రాణించాడు. కేప్‌టౌన్‌ బౌలర్లలో రబాడ 2, హెండ్రిక్స్‌, సామ్‌ కర్రన్‌, ఓలీ స్టోన్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో డర్బన్‌ SA20 2024 ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో నిన్న జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)