Breaking News

రాహుల్‌ గొప్పగా ఆడుతున్నాడు

Published on Sun, 07/20/2025 - 04:18

న్యూఢిల్లీ: నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకున్న భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌... ఇంగ్లండ్‌ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. మరో మూడు నాలుగేళ్ల పాటు అతడు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అండర్సన్‌–టెండూల్కర్‌’ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాహుల్‌ 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. 

ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్, జేమీ స్మిత్‌ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘రాహుల్‌ తన బ్యాటింగ్‌ శైలిలో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. బ్యాటింగ్‌ స్టాన్స్‌తో పాటు డిఫెన్స్‌ ఆడే తీరులో మరింత మెరుగయ్యాడు. దీంతో పరుగులు చేయడం అతడికి మరింత సులువవుతోంది. దీంతో పాటు బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గాయి. గతంలో ఇలా చాలా సార్లు అతడు అవుటయ్యేవాడు. నైపుణ్యం పరంగా రాహుల్‌ చాలా మెరుగ్గా ఉన్నాడు. 

ఈ సిరీస్‌లో బంతి ఎక్కువ స్వింగ్‌ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ అనుకోకుండా ఏదైన బంతి అనూహ్యంగా దూసుకొచి్చనా దాన్ని ఎదుర్కొనేందుకు రాహుల్‌ సిద్ధంగా ఉన్నాడు. ఇదే తీరు కొనసాగితే మరి కొన్నేళ్ల పాటు రాహుల్‌ అత్యున్నత స్థాయి ప్రదర్శన కొనసాగించగలడు. ఈ సిరీస్‌లో అతడి బెస్ట్‌ మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాహుల్‌ కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉంది. ఇలాగే సాగితే మరెన్నో శతకాలు అతడి ఖాతాలో చేరతాయి.

మున్ముందు టీమిండియా స్వదేశంలో చాలా మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో కెరీర్‌ ముగించే సమయానికి అతడి టెస్టు సగటు 50కి చేరువవడం ఖాయం’ అని వివరించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 61 టెస్టులు ఆడిన 33 ఏళ్ల రాహుల్‌ 35.26 సగటుతో 3632 పరుగులు చేశాడు. అందుటో 10 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)