Breaking News

చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఒకే ఒక్కడు

Published on Sun, 04/19/2026 - 17:19

ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. శ‌నివారం (ఏప్రిల్ 18) చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ది కీల‌క పాత్ర‌. త‌న 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచ‌రీతో ఆకట్టుకున్నాడు.

34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.

గతంలో 2021 సీజన్‌లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్‌డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌.. 168 పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లు
మైక్ హస్పీ
డేవిడ్ వార్నర్‌
కేఎల్ రాహుల్‌(రెండు సార్లు)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)