Breaking News

ఎక్కడైనా అంతే.. కేఎల్‌ రాహుల్‌ను తిట్టడం ఆపండి!

Published on Sat, 04/01/2023 - 23:43

టీమిండియా స్టార్‌... లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వైఫల్యం కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ మినహా మళ్లీ రాహుల్‌ కథ మొదటికే వచ్చింది. అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్‌లో మాత్రం దుమ్మురేపుతాడని అభిమానులు ట్రోల్‌ చేసేవారు. అయితే ఇకపై రాహుల్‌ను ట్రోల్‌ చేయడం ఆపేయాల్సిందే. ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడనే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఎందుకంటే కేఎల్‌ రాహుల్‌.. ఐపీఎల్‌ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్‌ సకారియా బౌలింగ్‌లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అంతే రాహుల్‌ కథ ముగిసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ ఇక్కడ మాత్రం ఓపెనర్‌గా వచ్చేశాడు. తనకు ఓపెనింగ్‌ కంటే ఐదో స్థానం కరెక్ట్‌ అని రాహుల్‌ భావించి వచ్చే మ్యాచ్‌ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది.

ఇక రాహుల్‌ తక్కువ స్కోరుకే వెనుతిరగడంపై అభిమానులు తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. ఎక్కడైనా రాహుల్‌ ఆటతీరు ఇంతే.. అతన్ని తిట్టడం, ట్రోల్‌ చేయడం ఆపండి.. 12 బంతుల్లో 8 పరుగులు... పొరపాటున టెస్టు మ్యాచ్‌ అనుకోలేదు కదా రాహుల్‌.. ఓపెనర్‌ వద్దు.. ఐదో స్థానమే నీకు ముద్దు.. అంటూ కామెంట్‌ చేశారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)