Breaking News

అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్‌.. వీడియో వైరల్‌

Published on Wed, 09/20/2023 - 13:33

KL Rahul Posts An Adorable Pic With His Wife Athiya Shetty: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా నెలల తరబడి జట్టు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్‌.. ఆసియా కప్‌-2023తో ఘనంగా పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్‌.. అజేయ సెంచరీ(111)తో సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. 

బ్యాట్‌తోనే కాదు  వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుని.. వన్డే వరల్డ్‌కప్‌-2023కి తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

సారథి రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ గైర్హాజరీ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 22న ఈ సిరీస్‌ మొదలు కానుండగా.. ఈ మధ్యలో దొరికిన కాస్త విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

భార్య అతియా శెట్టితో కలిసి.. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట గణపతి పూజలో పాల్గొన్నాడు. వైట్‌కుర్తా.. పైజామా ధరించి రాహుల్‌ హుందాగా కనిపించగా.. ఎరుపు రంగు చీరలో సంప్రదాయకట్టులో అతియా మెరిసిపోయింది. ఈ క్రమంలో రాహుల్‌- అతియా తమ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

హార్ట్‌ ఎమోజీతో ఇన్‌స్టాలో ఇద్దరూ బుధవారం ఫొటోలను షేర్‌ చేయగా... నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ దంపతుల వీడియో సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె, నటి అతియాతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఈ ఏడాది జనవరిలో ఆమెతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే.

చదవండి: ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్‌ ఎవరంటే? 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)