Breaking News

'రావడం అంత ఈజీ కాదు; అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం'

Published on Tue, 04/11/2023 - 18:40

రింకూ సింగ్‌.. ఇప్పుడొక సంచలనం. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ రింకూ సింగ్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసేసింది. ఎంతలా అంటే రెండు రోజుల నుంచి రింకూ సింగ్‌ ఇంకా ట్విటర్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లోనే కనబడేంతలా. ఒక్క మ్యాచ్‌ అతని దశను మారుస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. 


Photo: IPL Twitter

తాజాగా ఎన్డీటీవీకి రింకూ సింగ్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్య్వూలో అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.  తాను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. మేము సంపాదించడం మొదలెట్టాకా కూడా నాన్న తన సొంతకాళ్లపై నిలబడడానికే ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. క్రికెటర్‌ కాకముందు కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. దేవుడి దయ వల్ల ఇప్పుండంతా బాగానే ఉందని తెలిపాడు.

''నా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంతో చేస్తున్నా. గతంలో ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయాయి. మేము ఎదిగాకా నాన్నను జాబ్‌ మానేయాలని చెప్పాం. ఆయన 30 ఏళ్లుగా ఇంటింటికి తిరిగి గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కానీ ఆయన తన సొంతకాళ్లమీదే బతకాలని నిర్ణయించుకొని జాబ్‌ వదలడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇక కెరీర్‌లో ఎదగకముందు సోదరుడితో కలిసి నాన్నతో వెళ్లి గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసేవాళ్లం.


Photo: IPL Twitter

నాన్నకు నేను క్రికెట్‌ ఆడడం ఇష్టం ఉండేది కాదు. నాకు డబ్బు కావాలంటే నాన్నతో పాటు వెళ్లి సిలిండర్లు వేసేవాడిని.  కానీ ఇంట్లో అమ్మ ఇచ్చిన సపోర్ట్‌తో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ముందు మనల్ని మనం డొమొస్టిక్‌ క్రికెట్‌లో నిరూపించుకోవాల్సిందు. గత 6-7 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నా. కేకేఆర్‌ ఫ్రాంచైజీ నన్ను నమ్మి అవకాశమిచ్చింది. దానిని నిలబెట్టుకుంటా'' అని పేర్కొన్నాడు.

ఇక రింకూ సింగ్‌ తమ్ముడు కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టిన రింకూ సింగ్‌ తమ్ముడు జిల్లా స్తాయి క్రికెట్‌ ఆడుతూ మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో రింకూ సింగ్‌ ఇప్పటివరకు 20 మ్యాచ్‌లాడి 349 పరుగులు సాధించాడు.

చదవండి: RCB Vs LSG: మ్యాచ్‌ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా!

5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్‌! ఎవరీ రింకూ సింగ్‌?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)