Breaking News

IPL 2025: చ‌రిత్ర‌కు అడుగు దూరంలో ర‌హానే..

Published on Sun, 03/16/2025 - 11:55

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2025 సీజన్‌​ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌​ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్‌, కేకేఆర్ కెప్టెన్ అజిం‍క్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.

కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మూడోసారి..
రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్‌ సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్‌​ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

త‌ర్వాతి ఐపీఎల్‌-2019లో హాఫ్ సీజ‌న్ వ‌ర‌కు ఆర్ఆర్ జ‌ట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావ‌డంతో కెప్టెన్సీ నుంచి ర‌హానే త‌ప్పుకున్నాడు.  2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోవ‌డంతో ర‌హానే మ‌ళ్లీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

ఆ త‌ర్వాతి సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్‌-2025లో మెగా వేలంలో ర‌హానేను కేవ‌లం రూ. 1.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ర‌హానే ఆఖ‌రి రౌండ్‌లో కేకేఆర్ సొంతం చేసుకుంది.
చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)