Breaking News

శార్దుల్‌ ధనాధన్‌...కేకేఆర్‌ ఘన విజయం

Published on Fri, 04/07/2023 - 03:21

కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్‌ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుతో ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శార్దుల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. గుర్బాజ్‌ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్‌ కారణంగా కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్‌ విల్లీ, కరణ్‌ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు.

అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్‌ చక్రవర్తి (4/15), సునీల్‌ నరైన్‌ (2/16), తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ సుయశ్‌ శర్మ (3/30) తమ స్పిన్‌ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు.  

ఆ ఇద్దరి దూకుడుతో... 
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్‌ విల్లీ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో వరుస బంతుల్లో వెంకటేశ్‌ అయ్యర్, మన్‌దీప్‌ బౌల్డ్‌ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్‌ జోరు కొనసాగించడంతో కోల్‌కతా పవర్‌ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌ తొలి బంతికి కోల్‌కతా కెపె్టన్‌ నితీశ్‌ రాణా అవుటయ్యాడు.

ఆ తర్వాత రింకూ సింగ్‌తో జత కలిసి గుర్బాజ్‌ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 87/3తో నిలిచింది. కరణ్‌ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్‌కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్‌ పెవిలియన్‌ చేరడంతో కోల్‌కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్‌ ఠాకూర్‌ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.

20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్‌ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్‌ చివరి బంతికి హర్షల్‌ పటేల్‌ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్‌ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది.  

తడబాటు... 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్‌ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్‌ బౌలింగ్‌లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో డు ప్లెసిస్‌ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ తడబడింది. హిట్టర్లు బ్రేస్‌వెల్, మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది.

కోల్‌కతా జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగిన లెగ్‌ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్‌ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగిన అనూజ్‌ రావత్‌ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 


ఐపీఎల్‌లో నేడు 
లక్నోVs హైదరాబాద్‌ (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 


స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రహా్మనుల్లా గుర్బాజ్‌ (సి) ఆకాశ్‌దీప్‌ (బి) కరణ్‌ శర్మ 57; వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) విల్లీ 3; మన్‌దీప్‌ సింగ్‌ (బి) విల్లీ 0; నితీశ్‌ రాణా (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) బ్రేస్‌వెల్‌ 1; రింకూ సింగ్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 46; రసెల్‌ (సి) కోహ్లి (బి) కరణ్‌ శర్మ 0; శార్దుల్‌ ఠాకూర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సిరాజ్‌ 68; నరైన్‌ (నాటౌట్‌) 0; ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204.
వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–44–1, డేవిడ్‌ విల్లీ 4–1–16–2, ఆకాశ్‌దీప్‌ 2–0–30–0, బ్రేస్‌వెల్‌ 3–0–34–1, షహబాజ్‌ అహ్మద్‌ 1–0–6–0, కరణ్‌ శర్మ 3–0–26–2, హర్షల్‌ పటేల్‌ 3–0–38–1.  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) నరైన్‌ 21; డు ప్లెసిస్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 23; బ్రేస్‌వెల్‌ (సి) నితీశ్‌ రాణా (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 19, మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 5; హర్షల్‌ పటేల్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 0; షహబాజ్‌ అహ్మద్‌ (సి) శార్దుల్‌ (బి) నరైన్‌ 1; దినేశ్‌ కార్తీక్‌ (సి) వరుణ్‌ (బి) సుయశ్‌ శర్మ 9; అనూజ్‌ రావత్‌ (సి) నరైన్‌ (బి) సుయశ్‌ శర్మ 1; విల్లీ (నాటౌట్‌) 20, కరణ్‌ శర్మ (సి) నితీశ్‌ రాణా (బి) సుయశ్‌ శర్మ 1, ఆకాశ్‌దీప్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ చక్రవర్తి 17; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 123.
వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 2–0–17–0, టిమ్‌ సౌతీ 2–0–25–0, సునీల్‌ నరైన్‌ 4–0–16–2, వరుణ్‌ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్‌ శర్మ 4–0–30–3, శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–15–1.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు