Breaking News

శ్రీకాంత్‌ శుభారంభం

Published on Thu, 09/26/2024 - 04:02

మకావ్‌: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. మకావ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–14, 21–15తో డానిల్‌ దు»ొవెంకో (ఇజ్రాయెల్‌)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. 

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్‌ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌) 14–21, 21–10, 12–21తో పనిట్‌చాపోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, చిరాగ్‌ సేన్‌ (భారత్‌) 12–21, 17–21తో లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో, మిథున్‌ (భారత్‌) 12–21, 15–21తో హువాంగ్‌ యు కాయ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, సమీర్‌ వర్మ (భారత్‌) 21–18, 11–21, 13–21తో వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్‌ కున్‌–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్‌–జిహెనిచా (థాయ్‌లాండ్‌) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్‌ చాన్‌–యాంగ్‌ చు యున్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)