Breaking News

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ప్లేయర్‌.. 48 ఏళ్ల తర్వాత

Published on Sun, 11/08/2026 - 15:54

వెస్టిండీస్ యువ ఆట‌గాడు  కెవిన్ విక్‌హామ్ త‌న అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాడు. బంగ్లాదేశ్‌తో సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 23 ఏళ్ల విక్‌హామ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ  హాఫ్ సెంచ‌రీలు సాధించి అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన విక్‌హామ్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 78 ర‌న్స్‌తో కీల‌క నాక్ ఆడాడు. 

ఈ క్ర‌మంలో విక్‌హామ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.  అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ ఓ విండీస్ ప్లేయ‌ర్ హాఫ్ సెంచ‌రీలు సాధించడం 48 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం. చివ‌రిగా విండీస్ లెజెండ్ సౌదత్ శివ్‌నారాయణ్ ఈ ఫీట్ సాధించాడు. 1978లో ఆస్ట్రేలియాపై శివ్‌నార‌య‌న్ త‌న అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఫిప్టీలు సాధించాడు. ఓవ‌రాల్‌గా ఈ ఫీట్ సాధించిన 8వ విండీస్ బ్యాట‌ర్‌గా విక్‌హామ్ రికార్డులకెక్కాడు.

అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ  ఫిప్టీలు చేసిన విండీస్‌ బ్యాటర్ల జాబితా

ఫ్రాంక్ డి కైరెస్ – 80 & 70 (వర్సెస్ ఇంగ్లాండ్, 1930)

జార్జ్ గ్రాంట్ – 53* & 71* (వర్సెస్ ఆస్ట్రేలియా, 1930)

బ్రెయిన్ డేవిస్ – 54 & 58 (వర్సెస్ ఆస్ట్రేలియా, 1965)

క్లైవ్ లాయిడ్ – 82 & 78* (వర్సెస్ భారత్, 1966)

లారెన్స్ రోవ్ – 214 & 100* (వర్సెస్ న్యూజిలాండ్, 1972)

గోర్డాన్ గ్రీనిడ్జ్ – 93 & 107 (వర్సెస్ భారత్, 1974)

సౌదత్ శివ్‌నారాయణ్ – 53 & 63 (వర్సెస్ ఆస్ట్రేలియా, 1978)

కెవిన్ విక్‌హామ్ – 61 & 57* (వర్సెస్ బంగ్లాదేశ్, 2026)*

కాగా ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విండీస్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. విండీస్ ప్రస్తుతం 309 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)