Breaking News

టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్‌ లెజెండ్‌ సమాధానమిదే

Published on Thu, 11/30/2023 - 17:52

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి గత కొంత కాలంగా అతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత వీరిద్దరూ టీమిండియా తరపున టీ20ల్లో కన్పించలేదు. వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ నుంచి కూడా వీరిద్దరూ తప్పుకున్నారు.

దీంతో రోహిత్‌, కోహ్లి త్వరలోనే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విరాట్‌, రోహిత్‌ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ వరకు కొనసాగితే బాగుంటుందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చేందుకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఇద్దరికి ఛాన్స్‌ ఉంది. వారిద్దరూ ఐపీఎల్‌లో ఎలా ఆడుతారో చూడాలి. ఐపీఎల్‌లో వారు ఆట తీరు  చాలా ముఖ్యం. వారిద్దరూ చాలా కాలం నుంచి భారత జట్టుకు తమ సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి అందుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. వాళ్ల ఫామ్ చూసి, వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి.

ఇద్దరూ కూడా అద్బుతమైన క్రికెటర్లే. ఐపీఎల్‌లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే ఐపీఎల్‌ ఫైనల్‌కు టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభానికి మధ్య పెద్దగా గ్యాప్‌ ఉండదు. వేచి చూద్దం ఏమి జరుగుతుందో" అని పీటీఈకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పీటర్సన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్‌.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)