Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌గా పీటర్సన్‌

Published on Fri, 02/28/2025 - 03:57

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ సహాయక సిబ్బందిలో మరో కొత్త వ్యక్తి చేరాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ను క్యాపిటల్స్‌ మెంటార్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. 2009–2016 మధ్య పీటర్సన్‌ ఐపీఎల్‌ 36 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు సీజన్ల పాటు ఢిల్లీ (క్యాపిటల్స్‌) తరఫునే ఆడిన అతను బెంగళూరు, పుణే జట్లకూ ప్రాతినిధ్యం వహించాడు. 17 మ్యాచ్‌లలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్‌ 11 ఏళ్ల తర్వాత అదే జట్టుకు ఇప్పుడు మెంటార్‌ బాధ్యతలు చేపడుతున్నాడు. 

ఓవరాల్‌గా టి20 కెరీర్‌లో పీటర్సన్‌ 200 మ్యాచ్‌లు ఆడి 5,695 పరుగులు సాధించాడు. ఆటగాడిగా ఐపీఎల్‌ కెరీర్‌ ముగించిన తర్వాత కూడా ఢిల్లీ టీమ్‌ యాజమాన్యంతో పీటర్సన్‌ మంచి సంబంధాలు కొనసాగించాడు. ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక కౌంటీ టీమ్‌ను జీఎంఆర్‌ యాజమాన్యం కొనుగోలు చేయడంలో మధ్యవర్తిగా పీటర్సన్‌ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్‌లో మళ్లీ మరో హోదాలో అడుగు పెడుతున్నాడు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు