Breaking News

రోహిత్ శర్మకు నేను వీరాభిమానిని.. ఫియ‌ర్ లెస్‌గా ఆడుతాడు: మహారాజ్

Published on Sat, 06/29/2024 - 20:49

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించేందుకు హిట్‌మ్యాన్ సిద్దమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్ పోరులో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలతో కూడా అదరగొడుతున్నాడు.

 ఈ మెగా ఈవెంట్‌లో రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. సూపర్‌-8లో ఆసీస్‌పై అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ సత్తాచాటాడు. 

ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఫైనల్లోనూ రోహిత్ అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. హిట్‌మ్యాన్‌కు తన పెద్ద అభిమానినని మహారాజ్ చెప్పుకొచ్చాడు.

"నేను రోహిత్ శర్మకు వీరాభిమానిని. బ్యాటింగ్‌లో అతడు డేరింగ్ అండ్ డాషింగ్‌. బౌలర్లకు అతడంటే చాలా భయం. కెప్టెన్‌గా కూడా రోహిత్ అద్బుతం. అతడికి అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.  గేమ్‌ను బాగా ఆర్ధం చేసుకుంటాడు. 

జట్టులో పూర్తి స్వేఛ్చను రోహిత్ ఇస్తాడు. ఆటగాళ్లను సపోర్ట్ చేసి వారిలో బెస్ట్‌ను తీయడంలో రోహిత్ దిట్ట.  ఫీల్డ్‌లో కూడా రోహిత్ చాలా వ్యూహాత్మకంగా ఉంటడాని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాజ్ పేర్కొన్నాడు.
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)