Breaking News

ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా కేశవ్‌ మహారాజ్‌.. పడిపోయిన కుల్దీప్‌ యాదవ్‌

Published on Wed, 08/20/2025 - 16:28

ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 20) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఓ ప్రధాన మార్పు చోటు చేసుకుంది. బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మహారాజ్‌.. రెండు స్థానాలు మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరాడు. 

ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ, టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను రెండు, మూడు స్థానాలకు నెట్టాడు. టీమిండియా నుంచి కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా టాప్‌-10లో(తొమ్మిదో స్థానం) ఉన్నాడు. భారత పేస్‌ త్రయం షమీ, బుమ్రా, సిరాజ్‌ వరుసగా 13, 14, 15 స్థానాల్లో ఉన్నారు.

బ్యాటర్ల విభాగంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నంబర్‌ స్థానంలో కొనసాగుతుండగా.. బాబర్‌ ఆజమ్‌, డారిల్‌ మిచెల్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి గిల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (6) టాప్‌ 10లో ఉన్నాడు. 

ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి పేర్లు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ రెండు.. విరాట్‌ నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆకస్మికంగా వారి పేర్లు ర్యాంకింగ్స్‌ నుంచి మాయమైపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మొహమ్మద్‌ నబీ టాప్‌-2లో కొనసాగుతుండగా.. భారత్‌ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్‌ 10లో (పదో స్థానం) ఉన్నాడు. 

మహారాజ్‌ మాయాజాలం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 297 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 

ఫలితంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో ఓడించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ప్రదర్శనతో మహారాజ్‌ పలు రికార్డులను కొల్లగొట్టాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని దక్కించుకున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)