Breaking News

కోచింగ్‌లో కొత్త ‘కీర్తి’

Published on Sun, 04/27/2025 - 04:49

క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప విజయాలు అందుకున్న స్టార్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే అదే శిక్షణకు వచ్చేసరికి మాత్రం పురుషులే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీడాంశం ఏదైనా కోచింగ్‌లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ పురుష క్రీడాకారులకు మహిళలు కోచింగ్‌ ఇవ్వడం మరీ అరుదు. అయితే 32 ఏళ్ల కీర్తి తివారి ఇప్పుడు కోచింగ్‌లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంకా ప్లేయర్‌ వయసులోనే ఉంటూ ఒక ప్లేయర్‌గానే కనిపించే ఆమె శిక్షణను చూస్తే ఎంత సాధికారికంగా కీర్తికి పట్టు ఉందో అర్థమవుతుంది. తనదైన శైలిలో ఆమె ఈతరం విజేతలను తయారు చేస్తోంది.  

ప్లేయర్‌నుంచి కోచింగ్‌ వైపు... 
కీర్తి స్వయంగా రన్నర్‌. 400 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్‌. కానీ అక్కడ పెట్టిన పరుగు ఫలితమివ్వకపోవడంతో కోచ్‌ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. వ్యాయామ విద్యలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన కీర్తి తదనంతరం పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)లో కోచింగ్‌ డిప్లొమా పూర్తి చేసింది. 2019లో లక్నోలో తన శిక్షణను మొదలుపెట్టిన ఆమె ఫెడరేషన్‌ కప్‌లో ఓ విజేతను తయారు చేసింది. ఈ సీనియర్‌ జాతీయ ఈవెంట్‌లో పి. డేవిడ్‌ పురుషుల లాంగ్‌జంప్‌లో విజేతగా నిలువడంతో ఇప్పుడు కీర్తి పేరు తెరపైకి వచ్చిం ది.  

ఆమె నా కోచ్‌... 
కీర్తి ఫిజిక్‌ను చూసిన వారికి ఆమె ఓ అథ్లెట్‌గానే కనిపిస్తుంది. పురుషుల లాంగ్‌జంప్‌ పోటీ జరుగుతుంటే మహిళా అథ్లెట్‌కు ఏం పని అని అక్కడున్నవారు అనుకుంటుండగా... బరిలో ఉన్న డేవిడ్‌ కల్పించుకొని ఆమె నా కోచ్‌ అని చెప్పాల్సి వచ్చిం ది. ఎందుకంటే చాలామంది కోచ్‌లు మలివయసువారే ఉంటారు. యువకులెవరూ కోచ్‌లుగా ఉండరు. కానీ మూడు పదుల వయస్సున్న కీర్తిని సహజంగానే క్రీడాకారిణిగా భావించారంతా! అయితే ఈ యువ కోచ్‌ తన శిష్యుణ్ని తీర్చిదిద్దిన తీరు, విజేతగా మలచిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. 

పురుష ప్రపంచంలో ఆమె ఒంటరి పయనం 
విదేశాల సంగతి పక్కనబెడితే భారత్‌లాంటి దేశాల్లో అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఏ ఆటలో ఆసక్తి వుంటే తీసుకెళ్లేది పురుష కోచ్‌ వద్దకే. దిగ్గజ షట్లర్లు సైనా, సింధు తదితరులంతా పుల్లెల గోపీచంద్‌ శిక్షణలోనే ప్రపంచ బ్యాడ్మింటన్‌లో వెలిగారు. ఇలాంటి పురుష ప్రపంచంలో కీర్తి తన కోచింగ్‌ ప్రతిభతో పౌరుషాన్ని చాటింది. అకాడమీలో తాను ఒక ఒంటరనే ఫీలింగ్‌ ఉన్నా... తర్వాత అలవాటుపడింది. ఆటలో పడింది. కోచింగ్‌లోనే మమేకమైంది. దీంతో ఒంటరి పయనంలో ఆమె కనిపించేందుకు ఒక్కరే కావొచ్చు. కానీ కోచ్‌ పాత్ర తోడు–నీడ కావడంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది.  

కష్టమైనా... కోచింగే ఇష్టం 
మహిళా కోచ్‌కు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా వుండవు. పురుషాధిక్య సమాజంలో ఈ సవాళ్లతోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో దూరమయ్యే పరిస్థితి పురుషులకు సులువు... కానీ అమ్మాయిల పరిస్థితి చాలా భిన్నం. అందుకేనేమో చాలామంది మహిళలు కోచింగ్‌ వైపు వచ్చినప్పటికీ నిలదొక్కుకునే ముందే అస్త్రసన్యాసం చేస్తారు. తిరుగుటపా కట్టేస్తారు. కానీ కీర్తి మాత్రం ఎన్ని కష్టాలెదురైనా... తనకెంతో ఇష్టమైన కోచింగ్‌ను వదిలిపెట్టలేదు. 

కొన్నాళ్లుగా డేవిడ్‌ ప్రదర్శనకు మెరుగులు దిద్దుతున్న ఆమె చివరకు ఫెడరెషన్‌ కప్‌లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇంత చేసినా కూడా కొందరు ఈ మాత్రం ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు తీసుకెళ్తావా అని గేలి చేసినవారూ ఉన్నారు. దానికి ఆమె సమాధానం... అవును ఒలింపియన్‌ను తయారు చేయడమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది.   

#

Tags : 1

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)