Breaking News

ఎంత పనిచేశావు కమిన్స్‌!.. కావ్య రియాక్షన్‌ వైరల్‌

Published on Mon, 04/29/2024 - 16:26

పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్‌-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తైంది.

చెపాక్‌ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్‌ చేసేది సన్‌రైజర్స్‌ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్‌ సాగింది.

 

 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్‌ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.

ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 98 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్‌ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్‌ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.

కానీ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా.. ఆఫ్‌ కట్టర్‌గా సంధించగా..  గైక్వాడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

బంతిని అందుకున్న కమిన్స్‌ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ రెండు పరుగులు తీసుకుని సింగిల్‌ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్‌ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)