Breaking News

కోహ్లి స్ధానంలో అత‌డే స‌రైనోడు.. ఇంగ్లండ్‌కు పంపండి: కుంబ్లే

Published on Wed, 05/14/2025 - 19:06

ఇంగ్లండ్‌ ప‌ర్య‌టన‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రికి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించగా.. ఆ త‌ర్వాత వారం రోజుల‌కే విరాట్ కోహ్లి కూడా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జట్టును బీసీసీఐ వ‌చ్చే వారం ప్ర‌క‌టించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేస్తార‌న్న ప్ర‌శ్న అందరిలోనూ  మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 

టెస్ట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట.

"కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్‌కు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది. 

అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.

కాగా క‌రుణ్ నాయ‌ర్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీల‌క పాత్ర‌. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  నాయర్‌ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్‌ నాయర్ కొన‌సాగుతున్నాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు(అంచ‌నా)
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్‌, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్,  బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)