అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎనిమిదేళ్ల తర్వాత ఛాన్స్.. కట్ చేస్తే! రీఎంట్రీ మ్యాచ్‌లో డకౌట్
Published on Sat, 06/21/2025 - 18:26
టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ తన రీ ఎంట్రీలో తీవ్రనిరాశపరిచాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన.. కరుణ్ నాయర్‌కు తన లభించిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కరుణ్ డకౌటయ్యాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నాయర్ నాలుగు బంతులు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకోవడంతో నాయర్ డకౌట్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్ కూడా తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
టీమిండియా@471
ఇక మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
Tags : 1