Breaking News

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్‌?

Published on Mon, 06/16/2025 - 15:48

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్‌-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఈ క్ర‌మంలో తొలి టెస్టు కోసం టీమిండియా భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను భార‌త మాజీ క్రికెట‌ర్ దీప్ దాస్‌గుప్తా ఎంచుకున్నాడు.

తన ప్లేయింగ్ ఎలెవన్‌లో దాస్‌గుప్తా ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్న యువ ఆట‌గాడు సాయిసుద‌ర్శ‌న్‌కు మాత్రం దాస్ గుప్తా త‌న ఎంచుకున్న జ‌ట్టులో చోటు ఇవ్వ‌లేదు.

అత‌డి స్ధానంలో వెట‌ర‌న్ ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్ వైపు ఈ మాజీ క్రికెట‌ర్ మొగ్గు చూపాడు. సాయిసుద‌ర్శ‌న్ మంచి ఫామ్‌లో ఉన్న‌ప్ప‌టికి, అనుభవాన్ని పరిగణలోకి తీసకుని కరుణ్‌కు అవకాశమివ్వాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. కాగా నాయర్ దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక దీప్‌దాస్ గుప్తా ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. అదేవిధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శార్ధూల్ ఠాకూర్ బదులుగా నితీష్ కుమార్ రెడ్డిని దాస్‌గుప్త ఎంచుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు అవకాశమిచ్చాడు.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దాస్ గుప్తా ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్‌
యశస్వీ జైశ్వాల్‌,  కేఎల్ రాహుల్‌, కరుణ్ నాయర్‌, శుబ్‌మన్ గిల్‌(కెప్టెన్‌), రిషబ్ పంత్‌, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్‌ నాయర్‌

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)