Breaking News

‘తీవ్ర వేదన అనుభవించా’

Published on Thu, 06/19/2025 - 03:24

లీడ్స్‌: భారత జట్టు 2018 ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 1–4తో కోల్పోయింది. నాలుగో టెస్టు ముగిసేసరికే ఇంగ్లండ్‌ 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టూర్‌లో ఆరంభం నుంచి ఉన్న కరుణ్‌ నాయర్‌కు నాలుగు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. సిరీస్‌ ఫలితం ఖాయమైన నేపథ్యంలో కనీసం చివరి టెస్టులోనైనా చోటు దక్కవచ్చని అతను ఆశించాడు. అయితే కోహ్లి కెప్టెన్, రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 

ఒకవైపు నాయర్‌ టీమ్‌తోనే ఉండగా... అసలు ప్రధాన జట్టులోనే లేని హనుమ విహారిని భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు రప్పించి అతనితో అరంగేట్రం చేయించింది. దాంతో నాయర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత అతను భారత జట్టుకూ పూర్తిగా దూరమయ్యాడు. నాటి ఘటన తనను తీవ్రంగా బాధించిందని నాయర్‌ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత అదే ఇంగ్లండ్‌ గడ్డపైనే అతనికి టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం రానుండటం విశేషం. 

‘చివరి టెస్టులోనూ నాకు అవకాశం లేదని తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మైదానంలోనే కుప్పకూలిపోయినట్లుగా అనిపించింది. నేను ఆడటం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఆక్స్‌ఫర్డ్‌ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్లిపోయాను. బ్రాండెడ్‌ షూస్‌ మొదలు కనిపించిన ప్రతీ వస్తువును కొంటూ పోయాను. నేను గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు కూడా లేదు. 

కానీ ఈసారి ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. బ్యాగుల నిండా వస్తువులు తీసుకొని తిరిగొచ్చాను. ఆ సమయంలో షాపింగ్‌ చేస్తే నాకు సంతోషం కలుగుతుందేమో అన్నట్లుగా భావించాను కానీ అది అర్థం లేని ఆలోచన. భారత్‌కు ఆడటం తప్ప మరేదో ఆనందం ఇవ్వలేదని అర్థమైంది. నాకు సంబంధించి సిరీస్‌ అయిపోయింది. కానీ చివరి మ్యాచ్‌ ముగిసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనే ఆలోచనలో ప్రతీ రోజు ఒక నరకంగా అనిపించింది’ అని కరుణ్‌ నాయర్‌ తన బాధను వ్యక్తీకరించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)