Breaking News

డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్‌..

Published on Sat, 05/31/2025 - 16:32

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నను టీమిండియా వెట‌రన్ ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్  ఘ‌నంగా ఆరంభించాడు. కాంట‌ర్‌బ‌రీ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న తొలి అనాధికారిక‌-ఎ టెస్టులో క‌రుణ్ నాయ‌ర్‌.. భార‌త-ఎ జ‌ట్టు త‌ర‌పున అద్బుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

ఫ‌స్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన నాయ‌ర్‌..  272 బంతుల్లో తన డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 26  ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఓవ‌రాల్‌గా 204 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. నాయ‌ర్‌కు ఇది నాలుగో ఫ‌స్ట్ క్లాస్ ద్విశ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం.

కోహ్లి వారసుడు ఫిక్స్‌..?
కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో టెస్టుల్లో అత‌డి స్దానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌న్న చ‌ర్చ ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. కొంత‌మంది సాయిసుద‌ర్శ‌న్ పేరును సూచిస్తుంటే.. మ‌రి కొంత‌మంది కరుణ్ నాయ‌ర్‌ను పేరును చెబుతున్నారు.

ఇటువంటి స‌మ‌యంలో కోహ్లి స్ధానానికి త‌నే స‌రైనోడ‌న‌ని నాయ‌ర్ డ‌బుల్ సెంచ‌రీతో చాటుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో నాయర్‌కు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. నాయర్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 

రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీల‌క పాత్ర‌. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  నాయర్‌ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్‌ నాయర్ కొన‌సాగుతున్నాడు.
భారీ స్కోర్‌ దిశగా భారత్‌-ఎ
ఇక అనాధికరిక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌-ఎ జట్టు భారీ స్కోర్‌ దిశగా దూసుకువెళ్తోంది. 112 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌(92), ధ్రువ్‌ జురెల్‌(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)