Breaking News

రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి: కపిల్‌ దేవ్‌

Published on Tue, 12/10/2024 - 08:23

టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా  తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన రోహిత్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.

ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మైన హిట్‌మ్యాన్‌.. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం బ‌రిలోకి దిగాడు. ఈ డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శ‌ర్మ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

అదేవిధంగా కెప్టెన్సీ ప‌రంగా రోహిత్ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఫ‌లితంగా భార‌త జ‌ట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ ఫామ్‌, కెప్టెన్సీపై మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ మాత్రం రోహిత్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. రోహిత్ సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని క‌పిల్ అన్నారు.

‘రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి. ఏళ్ల తరబడి భారత క్రికెట్‌లో చిరస్మరణీయ విజయాలకు అవసరమైన పరుగులెన్నో చేశాడు. అలాంటి క్రికెటర్‌ సామర్థ్యంపై ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు. నాకైతే అస్సలే డౌటు లేదు.

త్వరలోనే తన ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడు. ఒకట్రెండు ప్రదర్శనలతోనే ఒక కెప్టెన్‌ ప్రతిభను అంచనా వేయడం తగదు. ఆ నాయకుడే ఆరు నెలల క్రితం భారత్‌ టి20 ప్రపంచకప్‌ అందించాడన్న సంగతి మరిచిపోవద్దు. రోహిత్ మ‌రింత బ‌లంగా తిరిగొస్తాడ‌ని ఆశిస్తున్నాను" అని క‌పిల్ ఓ కార్య‌క్ర‌మంలో పేర్కొన్నారు.
చదవండి: PKL 2024: తెలుగు టైటాన్స్‌ ఘోర ఓటమి..

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)