Breaking News

వరల్డ్‌ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్‌.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

Published on Wed, 07/05/2023 - 14:46

న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ను వెనుక్కి నెట్టి నంబర్‌వన్‌ టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్‌ నిలిచాడు.  యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రూట్‌ తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు.

ఇక విలియమ్సన్‌ తన టెస్టు కెరీర్‌లో నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. కాగా కేన్‌ చివరగా నాలుగు నెలల కిందట టెస్టుల్లో ఆడాడు. అయితే తన కంటే ముందున్న బ్యాటర్లు పేలవ ప్రదర్శన కారణంగా విలియమ్సన్‌ 883 రేటింగ్‌ పాయింట్స్‌తో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యాషెస్‌ రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌(882) రెండో స్ధానానికి చేరుకున్నాడు.

స్మిత్‌ విలియమ్సన్‌ కంటే  కేవలం ఒక్క పాయింట్‌ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అయితే యాషెస్‌ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు జరగనుండడంతో కేన్‌ను స్మిత్‌ అధిగమించే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‍ల్లో టీమిండియా నుంచి ఒకే ఒక్క బ్యాటర్ టాప్-10లో నిలిచాడు.

అతడే రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదంతో గాయపడి ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్‌ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ(729) పాయింట్లతో 12వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(700).. ఒక స్థానం పడిపోయి ప్రస్తుతం 14వ ర్యాంకుకు చేరాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)