Breaking News

SA Vs NZ: చరిత్ర సృష్టించిన విలియమ్సన్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు

Published on Mon, 02/10/2025 - 21:33

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. కివీస్ జ‌ట్టు ప్ర‌స్తుతం పాకిస్తాన్ వేదిక‌గా మ‌క్కోణ‌పు సిరీస్‌లో త‌ల‌ప‌డుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పాక్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటిన కేన్ మామ‌.. సోమ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో మ్యాచ్‌లోనూ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.

టీ20 త‌ర‌హాలో త‌న ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన విలియ‌మ్స‌న్ కేవ‌లం 72 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్‌కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవ‌రాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్‌.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్‌ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.

అంతకుమందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో అరంగేట్ర ఆట‌గాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అత‌డితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, ఓ రూర్క్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్‌ ఓ వికెట్‌ సాధించాడు.

చరిత్ర సృష్టించిన విలియమ్సన్‌..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్‌లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ  రి​కార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.

వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు
1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు
2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు
3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు
4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు
5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)