రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌

Published on Tue, 01/27/2026 - 14:54

ఆస్ట్రేలియా స్టార్‌ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్‌లో లిస్ట్-ఏ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 

అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ సాధించడంతో రిచర్డ్సన్  భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.

అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే రిచర్డ్సన్‌కు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్  ఒకరు. 

మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

చివరిగా 2025-26 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్‌ కెరీర్‌లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్‌ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.

రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్‌గా రిచర్డ్సన్‌కు మంచి గుర్తింపు ఉంది.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)