Breaking News

కమ్రాన్ ఆక్మల్ సూపర్ సెంచరీ.. పాక్ వరుసగా మూడో విజయం

Published on Sun, 07/27/2025 - 13:54

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం లీడ్స్‌ వేదికగా వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో పాక్‌ గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పాక్‌ ఓపెనర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 43 ఏళ్ల ఆక్మల్‌ విండీస్‌ బౌలర్లను ఊతికారేశాడు.

లీడ్స్‌ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 62 బంతులు ఎదుర్కొన్న ఆక్మల్‌.. 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అతడితోపాటు హాఫీజ్‌(23) రాణించాడు. విండీస్‌ బౌలర్లలో మహ్మద్‌, పొలార్డ్‌, బ్రావో, నర్స్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వి​కెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ టాపర్డర్‌ మొత్తం విఫలమైంది. క్రిస్‌ గేల్‌(5),స్మిత్‌(3), సిమ్మన్స్‌(0) తీవ్ర నిరాశపరిచారు. అయితే మిడిలార్డర్‌లో వాల్టన్‌(42), పెర్కిన్స్‌(30) పోరాడనప్పటికి విండీస్‌కు ఓటమి తప్పలేదు. 

పాక్‌ బౌలర్లలో రీస్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్‌, యమీన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన పాక్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)