ఫైనల్లో కళింగ లాన్సర్స్‌

Published on Sat, 01/24/2026 - 03:59

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో వేదాంత కళింగ లాన్సర్స్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కళింగ లాన్సర్స్‌ జట్టు 2–1 గోల్స్‌తో రాంచీ రాయల్స్‌పై గెలుపొందడంతో నేరుగా టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా, రాంచీ రాయల్స్‌ జట్టులో మన్‌దీప్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్‌ చేశాడు. 

రాంచీకి ఫైనల్‌ చేరే అర్హత రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్‌ తుఫాన్స్‌ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్‌ హైదరాబాద్‌ తుఫాన్స్‌ జట్టు రెండో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. 

శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌ జట్టు 2–0తో హెచ్‌ఐఎల్‌ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్‌ స్ట్రయికర్‌ శిలానంద్‌ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించాడు. హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ జీన్‌ పాల్‌ డానెబర్గ్‌ ప్రత్యర్థి గోల్స్‌ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు.    

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)