Breaking News

'శ్రేయ‌స్ ఏమి త‌ప్పు చేశాడు.. కావాల‌నే ఎంపిక చేయ‌లేదు'

Published on Thu, 05/29/2025 - 11:20

ఐపీఎల్‌-2025 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇంగ్లీష్ జ‌ట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. 

భార‌త టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ స్ధానంలో శుబ్‌మ‌న్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ నియ‌మితుడ‌య్యాడు. అయితే ఈ జ‌ట్టులో అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయస్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆట‌గాడు సాయి సుదర్శన్‌కు సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. తాజాగా సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యంపై భార‌త మాజీ క్రికెట‌ర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. సుద‌ర్శ‌న్ బ‌దులుగా అనుభ‌వం ఉన్న అయ్య‌ర్‌కు ఛాన్స్  ఇవ్వాల్సంద‌ని కైఫ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

"సాయి సుదర్శన్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజ‌న్‌లో బాగా రాణించ‌డంతో అత‌డిని టెస్టు జ‌ట్టులోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ‌త కొంత‌కాలంగా మూడు ఫార్మాట్ల‌లోనూ అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. 

వన్డే ప్రపంచ కప్‌-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్య‌ర్‌ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అత‌డు విజ‌య‌వంత‌మ‌య్యాడు. సుద‌ర్శ‌న్‌ను వైట్ క్రికెట్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా టెస్టు జ‌ట్టులోకి తీసుకున్న‌ప్పుడు, మ‌రి అయ్య‌ర్ విష‌యంలో ఏమైంద‌ని" సెల‌క్ట‌ర్ల‌పై కైఫ్ మండిప‌డ్డాడు.

ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)