Breaking News

చరిత్ర సృష్టించిన రబాడ.. దెబ్బకు ప్రపంచ రికార్డు బ్రేక్‌

Published on Mon, 10/21/2024 - 13:52

దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో రబాడ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సఫారీ పేస్ గుర్రం కేవలం 11,187 బంతుల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్  దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. 

యూనిస్ 12,602 బంతుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వకార్ ఆల్‌టైమ్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌ల పరంగా అయితే రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో ఉన్నాడు.  అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో రబాడ నాలుగో స్ధానంలో ఉన్నాడు.

మూడో సఫారీ పేసర్‌గా
అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సౌతాఫ్రికా బౌలర్‌గా రబాడ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో డేల్‌ స్టెయిన్‌(439) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.

బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు వీరే
క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 11817 బంతులు
వ‌కార్ యూనిస్ (పాకిస్థాన్‌) – 12602 బంతులు
డేల్ స్టెయిన్ (ద‌క్షిణాఫ్రికా) – 12605 బంతులు
అలాన్ డొనాల్డ్ (ద‌క్షిణాఫ్రికా) – 13672 బంతులు

టెస్టుల్లో ద‌క్షిణాఫ్రికా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..
డేల్ స్టెయిన్ – 93 మ్యాచ్‌ల్లో 439 వికెట్లు
షాన్ పొలాక్ – 108 మ్యాచ్‌ల్లో 421 వికెట్లు
మఖాయ ఎంతిని – 101 మ్యాచ్‌ల్లో 390 వికెట్లు
అలెన్ డొనాల్డ్ – 72 మ్యాచ్‌ల్లో 330 వికెట్లు
మోర్నీ మోర్కెల్ – 86 మ్యాచ్‌ల్లో 309 వికెట్లు
క‌గిసో ర‌బాడ – 65 మ్యాచ్‌ల్లో 301* వికెట్లు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)