Breaking News

ఆర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్‌’

Published on Sun, 07/13/2025 - 04:59

మాడ్రిడ్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌లో ‘హ్యాట్రిక్‌’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్‌లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌) చేతిలో పాయింట్‌ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది. 

మరో కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్‌ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్‌ తైపీకి చెందిన హువంగ్‌ జౌ, చెన్‌ యి సున్, చియు యు ఎర్‌ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో  మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది. 

కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్‌ యాదవ్‌ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్‌ నొలాస్కో (ఎల్‌ సాల్వడోర్‌) జంటపై గెలిచింది.   

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)