Breaking News

జ్యోతి ‘హ్యాట్రిక్‌’

Published on Mon, 02/10/2025 - 09:59

డెహ్రాడూన్‌: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన మహిళల అథ్లెటిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.

జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్‌ క్లర్క్‌గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ రోమన్‌ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.

తెలంగాణకు రెండు కాంస్యాలు జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. అథ్లెటిక్స్‌ మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో నిత్య, మైథిలి ఆకుమడుపుల, మాలోత్‌ సింధు, అగసార నందినిలతో కూడిన తెలంగాణ జట్టు (47.58 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల నెట్‌బాల్‌లో తెలంగాణ జట్టు సెమీఫైనల్లో 43ృ48 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ 9 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)