Breaking News

పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపిన హాకీ ఇండియా

Published on Wed, 09/10/2025 - 18:16

చెన్నై: పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు తొలి మ్యాచ్‌లో చిలీ జట్టుతో తలపడనుంది. చెన్నై, మదురై వేదికగా మొత్తం 24 దేశాల మధ్య ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 10 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్‌తో కలిసి భారత జట్టు పూల్‌ ‘బి’ నుంచి పోటీపడుతుంది.

ఇక టోర్నీ ఆరంభ రోజే చిలీతో భారత్‌ మ్యాచ్‌ జరగనుంది. మరుసటి రోజు పాకిస్తాన్‌తో... డిసెంబర్‌ 2న స్విట్జర్లాండ్‌ భారత్‌ మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్‌ విడుదల కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రామ్, హాకీ ఇండియా (హెచ్‌ఐ) కార్యదర్శి భోళానాథ్‌ సింగ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

పాకిస్తాన్‌ జట్టుకు ఆహ్వానం పంపాం
అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ హాకీ జట్టు... భారత్‌కు వస్తుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లోపించింది. ఆతిథ్య హోదాలో హాకీ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

‘పాకిస్తాన్‌ జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా కప్‌ సమయంలో కూడా పాకిస్తాన్‌ జట్టుకు ఆహ్వానం పంపాం. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు రాలేదు. జూనియర్‌ ప్రపంచకప్‌నకు సైతం మా నుంచి అధికారిక ఆహ్వానం పంపించాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్‌ టిర్కీ అన్నారు.  

చదవండి: Asia Cup 2025: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..?

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)