మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్
Published on Sun, 09/25/2022 - 04:50
న్యూయార్క్: జూలియస్ బేర్ జనరేషన్ కప్ అంతర్జాతీయ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ జోరు కొనసాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లియెమ్ క్వాంగ్ లీ (వియత్నాం)తో జరిగిన సెమీఫైనల్లో అర్జున్ 4–2తో గెలిచాడు.
నిర్ణీత నాలుగు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలువడంతో రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. రెండు టైబ్రేక్ గేముల్లో అర్జున్ విజయం సాధించాడు. టైటిల్ కోసం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్ (నార్వే)తో అర్జున్ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండు రోజులపాటు నాలుగు గేమ్‌లతో కూడిన రెండు ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
#
Tags : 1