Breaking News

వీలైనంత త్వరగా సుప్రీం కోర్టు తీర్పునివ్వాలి: గంగూలీ

Published on Mon, 09/09/2024 - 19:06

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన కేసులో సర్వోన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విజ్ఞప్తిచేశాడు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలన్నాడు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరుపుతోంది.

ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి
ఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన దర్యాప్తు తాజా నివేదికను సెప్టెంబరు 17లోగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం నాటి విచారణలో భాగంగా ఈ మేరకు గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన సౌరవ్‌ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీం కోర్టు ఈరోజు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో నాకు పూర్తి సమాచారం లేదు.

అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో నిరసన చేశారు. వారందరికీ న్యాయం జరగాలి. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందని తెలుసు. అయితే, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థిస్తున్నా. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి.

ఇదీ చదవండి: అభయ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం!

చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో గుబులుపుట్టేలా ఉండాలి. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. 

రాజకీయ రగడ
కాగా ఈ హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయా పార్టీల అభిమానులు సైతం రెండుగా చీలిపోయి.. పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. 

చదవండి: కోల్‌కతా డాక్టర్‌ కేసు: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)